BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

బూరుగుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు 60 స్టీల్ గ్లాస్‌ల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 08:06 PM
208 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల పరిధిలోని ఎంపీయూపీఎస్ బూరుగుగూడెం పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ అందించే పోషకాహారమైన రాగి జావ పంపిణీ కోసం 60 స్టీల్ గ్లాస్‌లను దాతలు విరాళంగా అందించారు.

స్వర్గీయ కనమత రెడ్డి శ్రీధర రెడ్డి స్మారకార్థం కొరప్రోలు సంధ్యారాణి సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్టీల్ గ్లాస్‌లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంగిడి చెన్నారావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం కోసం దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్టీల్ గ్లాస్‌లను అందించిన సంధ్యారాణికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బూరుగుగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ కార్యదర్శి ఉమ్మడి సీతారాములు మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి విద్య ఎంతో ముఖ్యమని, పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందించిన ఈ విరాళం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు ప్రసాద్, కృష్ణ, మణిగోపి దాతలను అభినందించగా, విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ వారి దాతృత్వ సేవలను కొనియాడారు.