BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 03:33 pm
Posted by : VALLAPU KOTESH

బీసీ సంక్షేమ హాస్టళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

తెలంగాణ
/ నల్గొండ
Reporter
Vallapu Kotesh Nampally Mandal
17 Nov, 2026 - 03:33 PM
29 వీక్షణలు

వారం రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే రోడ్డుపై ధర్నా: బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్

నల్గొండ | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్)

నల్గొండ జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను బీజేవైఎం జిల్లా నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హాస్టళ్లలో కనీస వసతులు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో బాత్‌రూమ్‌లకు తలుపులు లేకపోవడం, నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటం వంటి సమస్యలు విద్యార్థులకు ఇబ్బందికరంగా మారాయని తెలిపారు. అదేవిధంగా గదుల్లో ఫ్యాన్లు లేకపోవడం, డ్రైనేజీ సమస్యలు, గదుల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి అంశాలను గుర్తించినట్లు చెప్పారు.

విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడం అధికారుల బాధ్యత అని పేర్కొంటూ, హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని, నిరంతర నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాత డ్రైనేజీ వ్యవస్థను తొలగించి, దాని స్థానంలో కొత్త వ్యవస్థను నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని హాస్టళ్లలోని అన్ని సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు.

వారం రోజుల్లోగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహిస్తామని సతీష్ యాదవ్ హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శులు అక్కేనపల్లి సైదులు, ఏపూరి దయాకర్, ఉపాధ్యక్షులు బోడిగే భారత్, శాంతి స్వరూప్, మీడియా కన్వీనర్ సిలివేరూ నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ శివ, నార్కట్‌పల్లి మండల అధ్యక్షుడు యాట చంద్రశేఖర్, చిట్యాల పట్టణ అధ్యక్షుడు వైరాల రాహుల్, జిల్లా యువ నాయకుడు ఎర్రబోయిన వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

— బీజేవైఎం, నల్గొండ జిల్లా