BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 26 July 2025, 08:36 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రైతు సేవ కేంద్రాల ద్వారా అమ్ముతున్న ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ
26 Jul, 2025 - 08:36 AM
435 వీక్షణలు
రైతు సేవ కేంద్రాల ద్వారా అమ్ముతున్న ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి --- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో జిల్లా కలెక్టర్, ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సంయుక్తంగా చిట్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ఎరువుల స్టాకును పరిశీలించారు. రికార్డులన్నిటిని సక్రమంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలో ఎరువులు దుర్వినియోగం కారాదని, ఒకవేళ అలా జరిగితే సంబంధిత సీఈఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ లు సంయుక్తంగా హెచ్చరించారు. శనివారం రోజున జిల్లా కలెక్టర్, ఎస్పీలు నల్గొండ జిల్లా , హైదరాబాద్-విజయవాడ రహదారిపై వెలిమినేడు వద్ద ఉన్న యాడ్ బ్లూ, డి ఇ ఎఫ్ సేల్ కౌంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ డిఇఎఫ్ లో కలుపుతున్న యూరియా ఎలా వస్తుందో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు మాత్రమే వాడాలని, అలా కాకుండా ఇతర పనులకు వాడవద్దని, ఇండస్ట్రీలకు ఇండస్ట్రీ యూరియానే వాడాలని అన్నారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతుసేవ కేంద్రాల ద్వారా అమ్ముతున్న ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఎరువులను ప్రత్యేకించి యూరియాను దారి మళ్లిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ సబ్సిడీ యూరియాను రైతులు మాత్రమే వాడాలని, అలా కాకుండా పరిశ్రమలకు మళ్లించకూడదని,ఏదైనా పరిశ్రమ సబ్సిడీ యూరియాను వాడితే చట్ట పరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . యూరియాను వాడే అనుమానాస్పద ఇండస్ట్రీలన్నింటిపై పూర్తిస్థాయిలో తనిఖీ చేసి ఇండస్ట్రియల్ యూరియా కాకుండా, సబ్సిడీ యూరియాను వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల విషయంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారని, అంతేకాక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, చిట్యాల తహసిల్దార్ కృష్ణ,మండల వ్యవసాయ అధికారి గిరిబాబు, తదితరులు ఉన్నారు. Follow us on Website Facebook Instagram YouTube