BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 14 September 2026, 06:18 pm
Posted by : DAVU RAVINDER REDDY

గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు మేలు

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
14 Sep, 2026 - 06:18 PM
0 వీక్షణలు

ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ 

Telangana / Ntoday News: తెలంగాణ ఉద్యమంలో ముందున్నది, జర్నలిస్టుల పక్షాన పోరాటం చేసేది కేవలం ‘టీయూడబ్ల్యూజేహెచ్ 143 యూనియన్ మాత్రమేనని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ లో నిర్వహించిన 'టీయూడబ్ల్యూజే హెచ్ 143' జిల్లా మహా సభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని, జర్నలిస్టుల బాధలు, సమస్యలు అన్ని తమకు తెలుసని చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జర్నలిస్టుల అన్ని సమ స్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. ఉద్యమంలో ఉన్నందున నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇచ్చారని, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.42 కోట్లు కేటాయించడం జరిగిందని, కరోనా బారినపడ్డ 3900 మందికి ఆర్థిక సహాయం అందించినట్టు గుర్తు చేశారు. ఇక జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల విషయంలో ఎన్నడూ ఇంత గందర గోళ పరిస్థితి నెలకొనలేదని, అధికార యూనియన్ రాష్ట్ర నాయకుల వైఫల్యం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రైల్వే పాసులు, తదితర సమస్యల సాధన కోసం త్వరలోనే ఉద్యమ కార్యచరణ రూపొందించి, జర్నలిస్టుల పక్షాన పోరాడేందుకు ముందుంటామని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కార విషయంలో ముందుండి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.