BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 05:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలిశెట్టిపాడు గ్రామంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Nov, 2026 - 05:01 PM
28 వీక్షణలు

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి.. అధికారులకు తిరువూరు ఆర్డీఓ ఏ. కుమార్ ఆదేశం

ఏ. కొండూరు, ఎన్టీఆర్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ అధికారులను ఆదేశించారు. ఏ. కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి, గ్రామంలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ సేవలు, పారిశుద్ధ్య పనుల తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చూడాలని సూచించారు. అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించే సేవల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం గ్రామ సచివాలయంలోని వివిధ రికార్డులను పరిశీలించిన ఆర్డీఓ వాటి నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.