BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 07:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. లోతట్టు ప్రాంతాలపై వరద ప్రభావం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:18 PM
69 వీక్షణలు

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. లోతట్టు ప్రాంతాలపై వరద ప్రభావం

హైదరాబాద్, ఆగస్టు 1: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

వరద నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం–భద్రాచలం మధ్య రాకపోకలను శుక్రవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. గోదావరి ఉద్ధృతి కారణంగా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నాన ఘట్టాలు, సీతవాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి పూర్తిగా నీటమునిగాయి.

ఇదిలా ఉండగా, కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 19.20 మీటర్లకు చేరగా, పోలవరం వద్ద 11.96 మీటర్ల మేర ప్రవహిస్తోంది. వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.