BREAKING
గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం
Date of Publish : 21 July 2026, 07:45 pm
Posted by : V శ్రీనివాస్

భీమారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Jul, 2026 - 07:45 PM
49 వీక్షణలు

భీమారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ భీమారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు,సిబ్బంది పనితీరును సమీక్షించారు. అనంతరం స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు.ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు,రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు.స్టేషన్ పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు,పరిధిలోని గ్రామాల పరిస్థితులు, శాంతిభద్రతల పరిస్థితి,స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు.

5ఎస్ విధానంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు,ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.రౌడీషీటర్లు,

సస్పెక్ట్ షీటర్లు, నేరస్తుల ఇళ్లను తరచూ తనిఖీ చేయడంతో పాటు వారి కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అలాగే, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి,ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు, సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.