భారతరత్న, మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
/
మల్కాజ్‌గిరి
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. దేశానికి నిస్వార్థంగా సేవలందించిన నాయకుడిగా శాస్త్రిని స్మరించుకున్నారు.
‘జై జవాన్ – జై కిసాన్’ నినాదం ద్వారా దేశ రక్షణలో సైనికుల పాత్రతో పాటు దేశ ఆర్థిక ప్రగతిలో రైతుల కృషిని శాస్త్రి చాటిచెప్పారని సీఎం పేర్కొన్నారు. నిజాయితీ, నిరాడంబరత, కర్తవ్యనిష్ఠ, దేశభక్తికి శాస్త్రి జీవితం ప్రతీకగా నిలిచిందని తెలిపారు.
దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.