BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 05:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూటమి విజయానికి బీజేపీ క్రమశిక్షణే కొండంత అండ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Nov, 2026 - 05:01 PM
49 వీక్షణలు

10 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ స్థానంలో కూటమి జయకేతనం కార్యకర్తల సమిష్టి కృషికి దక్కిన ఫలితం.. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యం బీజేపీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి చాట్రాయి: కూటమి పార్టీల ఐక్యత, నాయకుల సమన్వయం, కార్యకర్తల అహర్నిశల శ్రమ వెరసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయపతాక ఎగురవేశామని భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి అన్నారు. 10 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం వెనుక ప్రతి కార్యకర్త కృషి, ప్రతి నాయకుడి పట్టుదల ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఏ ఒక్క పార్టీ ఖాతాలోనో వేసుకోలేమని, కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ సమిష్టిగా పనిచేసిన ప్రతి ఒక్కరి విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులు చూపిన ఐక్యత, అంకితభావం అభినందనీయమని కొనియాడారు. గ్రామస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తల శ్రమకు ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ఎండనక, వాననక ప్రచారంలో పాల్గొని, కూటమి అభ్యర్థులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుండగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మార్గదర్శకత్వంలో పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నాయని తెలిపారు. నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి నాయకత్వంలో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని శ్రీకర్ బుర్రి పేర్కొన్నారు. గతంలో జరిగిన అవినీతి, అక్రమాల పాలనకు అడ్డుకట్ట వేసి ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందించాలనే లక్ష్యంతో కూటమి పనిచేస్తోందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా భావించాలన్నారు. భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ, నిబద్ధత, సంస్థాగత బలం ప్రధానమని, ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూటమి ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ పార్టీ కార్యకర్తలు పనిచేశారని వివరించారు. కూటమి ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మిత్రపక్షాల అభ్యర్థుల విజయానికి బీజేపీ శ్రేణులు సహకరించడం రాజకీయ ఐక్యతకు నిదర్శనమన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల విశ్వాసం కోసం పనిచేయడమే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. ప్రస్తుత విజయాలతోనే సంతృప్తి చెందకుండా రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని ప్రకటించారు. ఇప్పటి విజయాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తారని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని శ్రీకర్ బుర్రి వెల్లడించారు.