BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 06:49 pm
Posted by : K MAHESH

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నెల్లికుదురు మండల అధ్యక్షుడిగా బొల్లేపల్లి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 06:49 PM
19 వీక్షణలు

గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం కృషి చేస్తా – శ్రీనివాస్ గౌడ్

నెల్లికుదురు, నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నెల్లికుదురు మండల అధ్యక్షుడిగా బొల్లేపల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రం మహబూబాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.

మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బొల్లేపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు.

గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గౌడ సామాజిక వర్గానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి అవకాశాలు అందేలా కృషి చేయడంతో పాటు సమాజ ఐక్యత, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

ముఖ్యంగా గౌడ యువతకు విద్య, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని, సామాజికంగా, ఆర్థికంగా గౌడ సమాజం అభివృద్ధి చెందేందుకు తన వంతు బాధ్యత నిర్వర్తిస్తానని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

తనకు మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు గండి వీరేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గండి సాయి గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు కరింగుల సాగర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గండి శారద గౌడ్‌లకు శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.