BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 04:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బోనకల్ యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణాలు మార్చి నాటికి పూర్తి చేయాలి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 04:19 PM
21 వీక్షణలు

పనుల్లో జాప్యం, అలసత్వం సహించేది లేదు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.. అధికారులకు కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశం

ఖమ్మం జిల్లా, నవంబర్ 17: బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. మంగళవారం మధిర నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీపురంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిని సమీక్షించారు. పాఠశాల ప్రాంగణంలో చేపట్టిన వివిధ నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిపాలనా భవనం నిర్మాణం పూర్తయిందని, నాలుగు విద్యా విభాగాల భవనాల్లో మూడు పూర్తయ్యాయని, వాటికి సంబంధించిన తుది మెరుగులు దిద్దే పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. మరో విద్యా భవనానికి సంబంధించి సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. సీనియర్ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న తొమ్మిది వసతి గృహాల్లో ఐదు పూర్తయ్యాయని, మరో వసతి గృహం నిర్మాణం పురోగతిలో ఉందని, మిగిలిన మూడు వసతి గృహాలు పునాది స్థాయి పనులను పూర్తి చేసుకున్నాయని వెల్లడించారు. జూనియర్ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న నాలుగు వసతి గృహాలకు స్లాబ్ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం తుది మెరుగుల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. వంటశాల, భోజనశాల భవనానికి సంబంధించిన సెంట్రింగ్ పనులు, భూగర్భ నీటి నిల్వ సంపు, పై నీటి నిల్వ ట్యాంకు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఉపాధ్యాయుల నివాస సముదాయానికి సంబంధించి ప్రస్తుతం భూమి చదును పనులు జరుగుతున్నాయని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో అంతర్గత రహదారుల నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. గుత్తేదారులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల వేగాన్ని పెంచాలని ఆదేశించారు. అవసరమైన మేరకు నిర్మాణ కార్మికుల సంఖ్యను పెంచి, అన్ని విభాగాల పనులను సమాంతరంగా కొనసాగించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలను పూర్తి చేయాలని, వచ్చే మార్చి నాటికి పాఠశాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ బుగ్గయ్య, డీఈ నాగేశ్వరచారి, ఏఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.