BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 07 February 2026, 09:38 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీఆర్‌ఎస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు

తెలంగాణ
07 Feb, 2026 - 09:38 AM
240 వీక్షణలు
బీఆర్‌ఎస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: కరీంనగర్ రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారీగా ఒక్కటై కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కోలగాని అనిల్ తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 54, 30, 31, 32, 33 డివిజన్ల కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతుగా నాకా చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ఆ వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో గెలిచే కాంగ్రెస్ కార్పొరేటర్ల ద్వారా అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకటేనని మరోసారి ఆరోపించిన మంత్రి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. #CongressCampaign #MunicipalElections #Karimnagar #TelanganaPolitics #AdluriLaxmanKumar #WelfarePolitics #UrbanDevelopment Follow us on Website Facebook Instagram YouTube