అనంతగిరి వద్ద లోయలో పడిన బస్సు.. పలువురికి గాయాలు
తెలంగాణ
/
హైదరాబాద్
వికారాబాద్: అనంతగిరి సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. బస్సు అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు.
ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి సంఖ్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.