BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 15 August 2026, 05:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 05:10 PM
205 వీక్షణలు

చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

చాట్రాయి: చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు డి. కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు. స్వాతంత్య్ర  సమర ఘట్టాల ప్రాముఖ్యతను ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి కనమతరెడ్డి ముత్తారెడ్డి కుమారుడు అమెరికాలో స్థిరపడిన విజయ్ కుమార్ రెడ్డి పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రతి తరగతిలో మొదటి, రెండో, మూడో స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ఐదుగురు విద్యార్థులకు, హాజరులో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి కలిపి మొత్తం రూ.50 వేల నగదు బహుమతులను వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అందించారు.

చాట్రాయి గ్రామానికి చెందిన కీర్తిశేషులు మందపాటి కాంతారెడ్డి, నాగరత్నమ్మ జ్ఞాపకార్థం వారి మనుమరాలు చల్లా అనిత కుమారి రూ.10 వేలు, బాణాల సీతామహాలక్ష్మి రూ.5 వేలు, తుమ్మల జగన్ రూ.5 వేల నగదు బహుమతులను అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డి. కృష్ణయ్య, ఉపాధ్యాయ బృందం, పాఠశాల ఎస్‌ఎంసీ వైస్ చైర్మన్ కె. ఆనందరావు, సభ్యులు, జనసేన నాయకుడు తుమ్మల జగన్, రామారావు, బీజేపీ నాయకుడు ఆదిమూలం శర్మ, దాతలు కనమతరెడ్డి ముత్తారెడ్డి, పాములపాటి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.