APWJF – APBJA అన్నమయ్య జిల్లా సమావేశం...
APWJF – APBJA అన్నమయ్య జిల్లా సమావేశం...
అన్నమయ్య జిల్లా
మదనపల్లి.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (APWJF), బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ (APBJA) ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా జర్నలిస్టుల సమావేశం ఆదివారం, 23-08-2026న నిర్వహించనున్నారు.
జర్నలిస్టుల సమస్యలు, వృత్తిపరమైన ఇబ్బందులు, సంక్షేమం, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేసి, వారి సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని నాయకులు వివరించనున్నారు.
అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
APWJF – APBJA, అన్నమయ్య జిల్లా
ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వృత్తిపరమైన ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను సహించేది లేదని వారు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం జర్నలిస్టులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
మహాసభకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకట్రావు, ఆంజనేయులు, కరవకుంట్ల జయరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, మదనపల్లె మార్కెట్ యార్డు చైర్మన్ శివరాం పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.