BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 March 2026, 12:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 12:20 PM
210 వీక్షణలు

చాట్రాయి మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమాల విస్తరణ

చాట్రాయి, మార్చి 18: చాట్రాయి మండలంలోని అన్ని గ్రామాల్లో “రైతన్న మీకోసం” కార్యక్రమాలను రైతులకు మరింత చేరువగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతు పండించే ప్రతి పంట లాభదాయకంగా మారేలా, వ్యవసాయాన్ని గౌరవప్రదమైన రంగంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోందని, వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య రంగాలు కలిపి సుమారు 35 శాతం వాటాను అందిస్తున్నాయని వివరించారు. “స్వర్ణాంధ్ర 2047” లక్ష్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో సంవత్సరానికి కనీసం 15 శాతం వృద్ధి సాధించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రభుత్వం ఐదు ప్రధాన దిశల్లో చర్యలు చేపట్టింది. సాగునీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహం ద్వారా నీటి భద్రత కల్పించడం, దేశీయ-అంతర్జాతీయ డిమాండ్ ఉన్న కొబ్బరి, కాఫీ, కోకో, ఆయిల్ పామ్ పంటల సాగును ప్రోత్సహించడం, అగ్రిటెక్ ద్వారా డిజిటల్ సేవలు అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, రైతులకు పూర్తి స్థాయి ప్రభుత్వ మద్దతు అందించడం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కే. హబీబ్ భాష రైతులతో సమావేశమై పై అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొని కరపత్రాలను రైతుల ఇళ్ల వద్ద పంపిణీ చేశారు.

ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి బి.శివశంకర్ తెలిపారు.