BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 16 March 2026, 12:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 12:55 PM
129 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని అన్ని గ్రామాల్లో “రైతన్న మీకోసం కార్యక్రమం” నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

రైతులకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి విషయాలపై అధికారులు వివరించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి, ప్రభుత్వ మద్దతు పథకాల గురించి కూడా రైతులకు తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించి తలసరి ఆదాయం పెంచుకునేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రిప్ సిస్టమ్, ఫెర్టిగేషన్ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు, డ్రోన్ సాంకేతికత వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులు గురించి కూడా రైతులకు తెలియజేశారు. రైతులను కేవలం ఉత్పత్తిదారులుగా కాకుండా విలువను సృష్టించే భాగస్వాములుగా మారేలా ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చాట్రాయి మండలంలోని అన్ని గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం కొనసాగుతుందని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, రైతులు పుచ్చకాయల సత్యనారాయణ రెడ్డి, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.