BREAKING
thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన
Date of Publish : 08 August 2026, 10:11 pm
Posted by : యామనూరి మల్లికార్జున

తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
08 Aug, 2026 - 10:11 PM
65 వీక్షణలు

చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ అన్నట్లుంది నీ యావ్యారం జగన్...!   

తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు 


ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ


ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఫ్యాన్ పార్టీ హైడ్రామా 

జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిన జగన్‌ను యువత నిలదీయాలి 

- మన్నవ మోహనకృష్ణ

-

 చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ అన్నట్లుగా ఉంది వైసీపీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి తీరు... ఐదేళ్లు పాటు డీఎస్సీ, జాబ్ కాల్యెండర్ల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిన వైసీపీ ప్రభుత్వం... తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసమే కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీపై నానా యాగీ చేస్తూ వీధి పోరాటలు చేయడం విడ్డూరంగా ఉందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న వీధి బాగోతాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏనాడు నిరుద్యోగులను పట్టించుకోని జగన్... నేడు ముసలి కన్నీరు కార్చుతూ నిరసన ర్యాలీలు చేపట్టడం సిగ్గుచేటున్నారు. లేని సమస్యను సృష్టించి ఆర్టిఫిషియల్ ఉద్యమం పేరుతో నాటకాలు ఆడుతున్న వైసీపీ బ్యాచ్‌ను ప్రజలు ఛీ కొట్టినా తమ తీరు మార్చుకోకపోవడం దారుణమన్నారు. డీఎస్సీపై వైసీపీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే న్యాయస్థానం తీవ్రంగా మొట్టికాయలు వేసిందని, వైసీపీ నాయకులు తాజాగా నిర్వహిస్తున్న నిరసనలలో నిరుద్యోగులు లేరని... రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, పిక్ పాకెటర్లతో మద్యం, డబ్బు పంచి ర్యాలీలు తీసుకొచ్చారని అన్నారు. నిరసనల పేరుతో కళాశాలల వద్ద విద్యార్థులను బెదిరించడం దుర్మార్గమని, గత ఐదేళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ పేరుతో సాక్షి క్యాలెండర్ పంచిన జగన్‌కు డీఎస్సీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రేయింబవళ్లు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది ఉపాధ్యాయుల శ్రమను, నిబద్ధతను దొంగ ఉపాధ్యాయులంటూ అవమానిస్తున్న వైసీపీ నైజంపై ఆ ఉపాధ్యాయులంతా తిరగబడాలని మోహనకృష్ణ పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు అమ్ముకున్న వైసీపీకి స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్టుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మళ్లీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, పోలీస్, గ్రూప్-1 తో పాటు మరో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రాబోతోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్న శుభతరుణంలో వైసీపీ సృష్టిస్తున్న ఈ ఫేక్ ఉద్యమాలను, కుట్రలను నిరుద్యోగులు, యువత తిప్పికొట్టాలని ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ పిలుపునిచ్చారు.  

Sd/-

మన్నవ మోహనకృష్ణ

ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్