BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 26 July 2026, 07:56 am
Posted by : కూనురు మధు

చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం 15 కి పైగా దుకాణాలు, పంచాయతీ రికార్డు రూమ్ దగ్ధం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
26 Jul, 2026 - 07:56 AM
355 వీక్షణలు

చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం  15 కి పైగా దుకాణాలు, పంచాయతీ రికార్డు రూమ్ దగ్ధం

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామపంచాయతీకి చెందిన షెడ్లలో/షట్టర్లలో నిర్వహిస్తున్న 15 కు పైగా బొమ్మల షాపులు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి.. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అవి పక్కనే ఉన్న మిగతా దుకాణాలకు శరవేగంగా వ్యాపించాయి. దుకాణాలకు ఆనుకుని నివాస ప్రాంతాలు కూడా ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

​పంచాయతీ భవనానికీ వ్యాపించిన మంటలు

​మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న గ్రామపంచాయతీ భవనానికి కూడా అగ్నికీలలు అంటుకున్నాయి. పంచాయతీ రికార్డు రూమ్‌లోకి మంటలు విస్తరించడంతో పలు కీలక రికార్డులు కాలిపోయినట్లు సమాచారం. ​రాత్రి సమయం కావడం, అగ్నిమాపక వాహనాలు సమయానికి చేరుకోకపోవడం వల్ల నష్టం తీవ్రత పెరిగిందని తెలుస్తోంది.


తీవ్ర శ్రమ తర్వాత కేవలం రెండు ఫైర్ ఇంజన్లు మాత్రమే సంఘటనా స్థలానికి చేరుకోవడంతో, ప్రమాద తీవ్రతకు మంటలను త్వరగా అదుపు చేయడం సాధ్యపడలేదు. దీంతో వ్యాపారులు భారీగా ఆస్తి నష్టాన్ని చవిచూశారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలు అదుపు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించారు..