BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 11 May 2026, 04:40 pm
Posted by : కూనురు మధు

చెర్వుగట్టు ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
11 May, 2026 - 04:40 PM
426 వీక్షణలు

చెర్వుగట్టు ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం NTODAY NEWS చెరువుగట్టు

హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం

* చెరువుగట్టు ఆలయ అభివృద్ధికి సహకరిస్తా : ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వేముల వీరేశం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ నూతన చైర్మన్‌గా ఎన్నికైన వారాల రమేష్ మరియు ఇతర డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో వారితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ ఆలయ ​కమిటీ సభ్యులను అభినందిస్తూ ఎమ్మెల్యే వీరేశం పలు సూచనలు చేశారు. చెర్వుగట్టు క్షేత్రం ఎంతో పురాతనమైనది అని, మహిమాన్వితమైనది అని పేర్కొన్నారు.  ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలి అని సూచించారు. నూతన కమిటీ సభ్యులు విభేదాలకు తావులేకుండా సమిష్టిగా కృషి చేసి ఆలయ ఖ్యాతిని మరింత పెంచాలి అని కోరారు. ఆలయ అభివృద్ధి పనులకు తన వంతుగా పూర్తిస్థాయి సహకారం, నిధుల మంజూరులో చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఊశయ్య, నార్కట్‌పల్లి, చెర్వుగట్టు, ఎల్లారెడ్డి గూడం సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, దేవాదాయ శాఖ అధికారులు, పూర్వ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.