BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 05:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిలకలూరిపేటలో వారాహి, దుర్గాదేవి విగ్రహాలకు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Nov, 2026 - 05:27 AM
23 వీక్షణలు

నవంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు ప్రతిష్ఠా మహోత్సవాలు మహాబలిపురంలో ప్రత్యేకంగా చెక్కించిన అమ్మవార్ల విగ్రహాల ఊరేగింపు అంగరంగ వైభవం 11న ఉదయం 10.24 గంటలకు ప్రధాన ప్రతిష్ఠా ముహూర్తం చిలకలూరిపేట, పల్నాడు జిల్లా: చిలకలూరిపేట పట్టణంలోని మద్ది నగర్, చీరాల రోడ్డులో ఉన్న శ్రీ జగన్నాథ శ్రీ ముత్తుమారెమ్మ అమ్మవారి ఆలయంలో వారాహి, దుర్గాదేవి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠతో పాటు విమాన శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9, 10, 11 తేదీల్లో మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్న మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. మహాబలిపురంలో ప్రత్యేకంగా చెక్కించిన వారాహి అమ్మవారు, దుర్గాదేవి విగ్రహాలను శనివారం ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విగ్రహాల ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా సాగింది. పురుషోత్తపట్నం నుంచి అడ్డరోడ్డు సెంటర్, గడియార స్తంభం, కళామందిర్ మీదుగా మద్ది నగర్‌లోని ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులు, ఆలయ శాశ్వత ధర్మకర్త మొలక పవన్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వైఖానస ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం ఋత్విక్కుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నవంబర్ 11వ తేదీ బుధవారం ఉదయం 10.24 గంటలకు ప్రధాన ప్రతిష్ఠా ముహూర్తాన్ని నిర్ణయించారు. మూడు రోజుల కార్యక్రమాల వివరాలు నవంబర్ 9, సోమవారం: సాయంత్రం 6 గంటలకు మంగళవాయిద్యాలు, విఘ్నేశ్వర ఆరాధన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురార్పణ, వాస్తు పూజ, వాస్తు హోమం, హారతి, తీర్థప్రసాద వితరణ నిర్వహిస్తారు. నవంబర్ 10, మంగళవారం: ఉదయం 7 గంటలకు పంచగవ్య ఆరాధన, అగ్ని మధనం, అగ్ని ప్రతిష్ఠ, అధివాస హోమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ప్రభూత బలి ప్రధానం, గ్రామోత్సవం, నవగ్రహ హోమం, మహాశాంతి హోమం, సర్వదేవతా హోమం, పంచశయ్యాధివాసనం కార్యక్రమాలు ఉంటాయి. నవంబర్ 11, బుధవారం: ఉదయం 6 గంటల నుంచి సుప్రభాత సేవ, అభిషేకం, రత్నన్యాసం, యంత్రస్థాపన నిర్వహిస్తారు. ఉదయం 10.24 గంటలకు కల్యాణం, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, మంగళహారతి, ఆచార్య సన్మానం జరగనున్నాయి. అనంతరం ఉదయం 11 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, పల్నాడు అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, మేనేజింగ్ పార్టనర్ ఆర్. కనకదుర్గ పద్మజ, ఆర్. బంగారయ్య, మున్సిపల్ చైర్మన్ తోట రాజరాజేశ్వరి దంపతులు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవార్ల దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ శాశ్వత ధర్మకర్త మొలక పవన్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆలయ చిరునామా: మద్ది నగర్, 3వ లైన్, చీరాల రోడ్డు, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా – 522616. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 99013 17509, 99895 74769, 97044 41283.