BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 04:31 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

శిరమా శ్రీనివాసరావుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాళి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
02 Jun, 2026 - 04:31 PM
28 వీక్షణలు

టీడీపీ సీనియర్ నాయకుడు శిరమా శ్రీనివాసరావుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాళి

చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ బీసీ సెల్ కోశాధికారి శిరమా శ్రీనివాసరావు స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు Prathipati Pulla Rao తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పట్టణంలోని 17వ వార్డు, పాటిమీద ప్రాంతంలో ఉన్న వారి స్వగృహానికి వెళ్లి, భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శిరమా శ్రీనివాసరావు పార్టీ అభివృద్ధికి, బీసీ వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన నాయకుడని ప్రత్తిపాటి పుల్లారావు గుర్తు చేశారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని శిరమా శ్రీనివాసరావుకు తమ నివాళులు అర్పించారు.