BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 16 August 2026, 07:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్‌కు ప్రశంస పురస్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 07:02 AM
59 వీక్షణలు

చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్‌కు ప్రశంస పురస్కారం

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ పి. అశోక్‌ను ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు.

విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తూ అంకితభావంతో సేవలు అందించినందుకు గుర్తింపుగా ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ చేతుల మీదుగా అశోక్‌కు కమెండేషన్ అవార్డు (ప్రశంస పురస్కారం) అందజేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీలత, ఏలూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఏ. అవులయ్య మాట్లాడుతూ సిబ్బంది ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉత్తమ సేవలకు గుర్తింపు లభించడం సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.