BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 05:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్‌లో అవకతవకల ఆరోపణలు.. విచారణకు తల్లిదండ్రుల డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 05:45 PM
94 వీక్షణలు

చింతలపూడి పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్‌లో అవకతవకల ఆరోపణలు.. విచారణకు తల్లిదండ్రుల డిమాండ్

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు

ఏలూరు జిల్లా చింతలపూడి పీఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ (సుబ్బరాజు)లో పలు ఆర్థిక, పరిపాలనా అవకతవకలు జరుగుతున్నాయంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద అందించే పౌష్టికాహారంలో లోపాలు ఉన్నాయని, చిక్కీలు సుమారు 2,000కు పైగా, కోడిగుడ్లు 500 నుంచి 600 వరకు లెక్కల్లో వ్యత్యాసం ఉన్నట్లు చెబుతున్నారు.

పీఎం శ్రీ నిధుల వినియోగంలో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా తప్పుడు బిల్లులు సమర్పించి నిధులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే ఉండగా, విద్యార్థుల నుంచి రూ.250 వసూలు చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మూడో శనివారం నిర్వహించే "నో బ్యాగ్ డే" సందర్భంగా విద్యార్థులకు అందించాల్సిన స్నాక్స్ ఇవ్వకుండానే బిల్లులు చేసినట్లు, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి కేటాయించిన రూ.25 వేల వ్యయంలో కూడా తప్పుడు బిల్లులు పెట్టి నిధులు డ్రా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే యాన్యువల్ డే నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన రూ.50 వేల బడ్జెట్‌ను వినియోగించకుండా విద్యార్థుల నుంచే డబ్బులు వసూలు చేశారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ఈ అంశంపై మండల విద్యాశాఖ అధికారి–2 కిరణ్ బాబును సంప్రదించగా, చిక్కీలు, కోడిగుడ్ల లెక్కల్లో వ్యత్యాసం ఉన్న విషయం నిజమేనని, దీనిపై ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరామని తెలిపారు. అయితే మెగా పీటీఎం లెక్కలు ఇంకా నమోదు చేయలేదని ప్రధానోపాధ్యాయుడు వివరణ ఇచ్చినట్లు చెప్పారు.

పాఠశాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలు వెలికి తీసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

గమనిక: పై వివరాలు తల్లిదండ్రుల ఆరోపణలు మరియు మండల విద్యాశాఖ అధికారి తెలిపిన ప్రాథమిక సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. అధికారిక విచారణ అనంతరం వాస్తవాలు తేలాల్సి ఉంది.