BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు.. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్న పేదగర్ల సునీత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 09:35 PM
25 వీక్షణలు

నగర పంచాయతీ చైర్మన్ పీఠమే లక్ష్యంగా ముందుకు.. ప్రజల మద్దతుపై అభ్యర్థిని ధీమా ఏలూరు జిల్లా, చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థి పేదగర్ల సునీత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో మమేకమవుతూ తమ పార్టీ విధానాలు, గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. చింతలపూడిలో తొలిసారిగా నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో రాజకీయంగా ఈ ఎన్నికలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తొలి పాలకవర్గంలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో పేదగర్ల సునీత ఓటర్లను నేరుగా కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, స్థానిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలు తమ పార్టీకి మద్దతుగా నిలుస్తారని, చింతలపూడి నగర పంచాయతీ చైర్మన్ స్థానం వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని సునీత ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొంటూ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు

.