BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

పోలీసులకు ధైర్యం చెప్పిన మంత్రి

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 08:00 PM
61 వీక్షణలు

చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు ఘటనలో గాయాలైన పోలీసులను ప‌రామ‌ర్శించిన‌ హోం మంత్రి  అనిత

పోలీసులకు ధైర్యం చెప్పిన మంత్రి

ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన హోం మంత్రి

మంగళగిరి, ఏప్రిల్ 06:- కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని ఆమె ప‌రామ‌ర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయాలైన పోలీసులకు ధైర్యం చెప్పిన మంత్రి, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల నుంచి సీజ్ చేసిన పేలుడు పదార్థాలను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనలో ఎస్సై, కోర్ట్ కానిస్టేబుల్ మరియు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడినట్లు వివరించారు. అబ్దుల్లా అనే కానిస్టేబుల్‌కు 50-60 శాతం గాయాలున్నాయని, మిగతా వారికి ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గాయపడిన పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి, వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.