BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 July 2026, 03:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చంద్రబాబు ఆదేశాలే తనకు మార్గదర్శకం: బోండా ఉమా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 03:18 PM
71 వీక్షణలు

చంద్రబాబు ఆదేశాలే తనకు మార్గదర్శకం: బోండా ఉమా

విజయవాడ, జూలై 29: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఎప్పుడూ శిరసావహిస్తానని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇటీవల నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలను కలవాల్సి వచ్చిందని, అయితే ఆ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని తెలిపారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించి ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది పూర్తిగా సమన్వయ లోపం వల్లే జరిగిందని కమిటీకి వివరించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని కమిటీకి హామీ ఇచ్చినట్లు బోండా ఉమా వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి చంద్రబాబు సూచనల మేరకు ముందుకు సాగుతానని ఆయన పునరుద్ఘాటించారు.