BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 03:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఆగస్టు 4న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 03:51 PM
212 వీక్షణలు

చాట్రాయి, జూలై 30: చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఈ నెల 4వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ రాజబాబు తెలిపారు.

భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలతో ఈఈ రాజబాబు, ఏఈ చైతన్య సమావేశమై చర్చించారు. ప్రోటోకాల్‌కు అనుగుణంగా భూమిపూజను ఘనంగా నిర్వహించేలా అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఈఈ రాజబాబు సూచించారు.

ఈ సమావేశంలో చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, చీదిరాల మారేశ్వరరావు, కందుల కృష్ణ, పరసా శ్రీను, డా. దుర్గాప్రసాద్, చనుబండ ఆరోగ్య కేంద్రం సిబ్బంది, మోరంపూడి రమేష్, బొట్టు దుర్గారావు, చీదిరాల మురళి తదితరులు పాల్గొన్నారు.