BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 01:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 01:22 PM
58 వీక్షణలు

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ పింఛన్లు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

టీడీపీ నేత మోరంపూడి రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలనెలా ఆర్థిక భరోసా లభిస్తోందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.

చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తుమ్మల జగన్ మాట్లాడుతూ సామాజిక భద్రత కల్పించడంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని కుటుంబాల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.