BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 07:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఇంటింటికీ చేరిన కూటమి సంక్షేమం.. ప్రజలతో మమేకమైన టీడీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:46 AM
115 వీక్షణలు

చనుబండలో ఇంటింటికీ చేరిన కూటమి సంక్షేమం.. ప్రజలతో మమేకమైన టీడీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న "కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు" కార్యక్రమం శనివారం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేద, రైతు, మహిళ, యువత, విద్యార్థి, వృద్ధుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు.

గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమైన నాయకులు ప్రభుత్వ పనితీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆదరణతో కూటమి ప్రభుత్వంపై గ్రామస్తులు పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిదిరాల మారేశ్వరావు, పిఏసియస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు,  నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, అభిమానులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.