BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 27 July 2026, 08:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 08:48 PM
117 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో సోమవారం సాయంత్రం "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమాన్ని గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రెండో బూత్ పరిధిలో నాయకులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 6,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయడం కూటమి ప్రభుత్వ ఘనత అని అన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను రూ.4,000కు, దివ్యాంగుల పింఛన్లను రూ.6,000కు పెంచి ప్రతి నెల ఒకటో తేదీన అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే తల్లికి వందనం, దీపం-2, స్త్రీ శక్తి, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో వంటి పథకాలతో పాటు సిమెంట్ రోడ్ల నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వరరావు, కందుల కృష్ణ, పరసా శ్రీను, నక్కా రాము, బొట్టు దుర్గారావు, గుడిమల్ల బ్రహ్మయ్య, దార్ల సురేష్ కుమార్, చేనుబోయిన వెంకటేశ్వరరావు, మిద్దె చెన్నారావు, నక్కా చెన్నారావు, విస్సంపల్లి పూర్ణ తదితరులు పాల్గొన్నారు.