BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 03 September 2026, 07:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో రైతు కుటుంబానికి సహకార సంఘం ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 07:30 PM
73 వీక్షణలు

రైతుల సంక్షేమం, అభివృద్ధే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రధాన లక్ష్యమని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు.

చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యుడు, కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన నర్సింగు రాఘవులు ఇటీవల మృతి చెందారు. ఆయన భార్య జమలమ్మకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం సంఘం తరఫున రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. గురువారం మధ్యాహ్నం మృతుని ఇంటికి వెళ్లిన సంఘం అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు ఈ మొత్తాన్ని జమలమ్మకు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులకు సకాలంలో అన్ని రకాల రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన రసాయన ఎరువులను కూడా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రైతుల శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కృష్ణారావుపాలెం తాజా మాజీ సర్పంచ్ చిమటబోయిన పుల్లారావు, సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.