BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 27 March 2026, 04:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో శ్రీరామ నవమి వేడుకలు ప్రశాంతంగా ముగింపు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 04:15 PM
221 వీక్షణలు

చనుబండలో శ్రీరామ నవమి వేడుకలు ప్రశాంతంగా ముగింపు  పోలీసుల పటిష్ట బందోబస్తుతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణ

చాట్రాయి, మార్చి 27:

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా, ప్రశాంతంగా ముగిసింది. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసినా, పోలీసుల పటిష్ట బందోబస్తు కారణంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ మార్గదర్శకత్వంలో చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ పోలీస్ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వేడుకలకు విచ్చేసిన డిఎస్పీ కుటుంబ సభ్యులు, ఇన్స్పెక్టర్ సతీమణి కూడా శ్రీరామలవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లను క్రమబద్ధీకరించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఆలయ మార్గాల్లో వాహన రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళలు, వృద్ధ భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంలో సిబ్బంది చొరవ చూపారు.

ఈ సందర్భంగా ఎస్ఐ డి. రామకృష్ణ మాట్లాడుతూ భక్తుల సహకారం, పోలీస్ సిబ్బంది అంకితభావం వల్ల వేడుకలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిస్తూ, భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో చాట్రాయి పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.