BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 02 March 2026, 07:25 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మంగళవారం హోలీ పండుగ నిర్వహణపై స్పష్టత

తెలంగాణ
02 Mar, 2026 - 07:25 AM
301 వీక్షణలు
  మంగళవారం హోలీ పండుగ నిర్వహణపై స్పష్టత NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా హోలీ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ స్పష్టత ఇచ్చారు. కొన్ని క్యాలెండర్లలో భిన్న తేదీలు చూపడంతో ప్రజల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో పంచాంగం ప్రకారం సోమవారం కామదహనం, మంగళవారం హోలీ పండుగ నిర్వహించాలని సూచించారు. వాసుదేవ శర్మ మాట్లాడుతూ, కామదహనం చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని తెలిపారు. హోలీ పండుగ సమాజంలో శాంతి, సౌహార్ద్రం, సోదరభావం పెంపొందించే పండుగగా ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. రంగుల పండుగను పరస్పర గౌరవంతో, ఎలాంటి అపశృతి లేకుండా జరుపుకోవాలని సూచించారు. రసాయనిక రంగులు వినియోగించకుండా సంప్రదాయ పద్ధతుల్లో పండుగను నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని కోరారు. స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ధూప దీప నైవేద్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సామాజిక ఐక్యతను చాటుతూ హోలీ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. #HoliFestival #Kamadahanam #Chityal #Telangana #FestivalGuidelines #CulturalHarmony Follow us on Website Facebook Instagram YouTube