BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 14 September 2026, 06:20 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను వాడాలి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
14 Sep, 2026 - 06:20 PM
0 వీక్షణలు

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను వాడాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

ధర్మపురి 

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో "DMD" యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద భక్తులకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చైర్‌పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను అందజేశారు.

​ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల కంటే మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. మట్టి విగ్రహాల వల్ల చెరువులు, నదులు మరియు స్థానిక నీటి వనరులు కాలుష్య బారిన పడకుండా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహ కలిగి ఉండాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో DMD యూత్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు మరియు పుర ప్రజలు పాల్గొన్నారు.