బోవెన్‌పల్లిలో కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ
MNR గార్డెన్ రోడ్‌లో GVPల శాశ్వత నిర్మూలనపై అధికారులకు ఆదేశాలు
మల్కాజిగిరి | Ntoday News
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోవెన్‌పల్లి MNR గార్డెన్ రోడ్‌లో మున్సిపల్ కమిషనర్ ఉదయాన్నే క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. ప్రాంతంలో పేరుకుపోతున్న చెత్త, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల (GVP) సమస్యను పరిశీలించి, వాటి శాశ్వత నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోవెన్‌పల్లి ప్రత్యేక సర్కిల్‌గా ఉంది.
అక్రమంగా చెత్త వేసే వారిని గుర్తించేందుకు అవసరమైన ప్రాంతాల్లో CCTV నిఘా ఏర్పాటు చేయడంతో పాటు వాచ్‌మన్‌ను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. చెత్తను ప్రతిరోజూ, నిరంతరాయంగా తొలగించేలా పారిశుధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఒకసారి చెత్త తొలగించిన తర్వాత ఆ ప్రాంతం మళ్లీ GVPగా మారకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డుపై చెత్త వేయడం చిన్న విషయంగా కనిపించినప్పటికీ, దాని ప్రభావం మొత్తం కాలనీ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యంపై ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు చెత్తను నిర్ణీత విధానంలోనే మున్సిపల్ సిబ్బందికి అందించి, GVPల నిర్మూలనలో సహకరించాలని కోరారు.
“మన వీధి మన బాధ్యత.. మన మల్కాజిగిరి మన ఇల్లు” అనే సందేశంతో ప్రజలు, అధికారులు కలిసి పనిచేస్తే పరిశుభ్రమైన మల్కాజిగిరిని నిర్మించవచ్చని పేర్కొన్నారు.