BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 25 November 2025, 06:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

తెలంగాణ
25 Nov, 2025 - 06:23 AM
399 వీక్షణలు
ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా... నాడు అన్న‌దాత‌ల‌ను న‌ట్టేట ముంచిన వైసీపీ ప్ర‌భుత్వం రైతులపై జగన్‌ది కపట ప్రేమ జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటెల బాలాజి చిల‌క‌లూరిపేట‌: నాడు వ్య‌వ‌సాయ రంగాన్ని, అన్న‌దాత‌ల‌ను న‌ట్టేట ముంచి నేడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌ రైతుల‌పై క‌ప‌ట ప్రేమ చూపుతున్నార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటెల బాలాజి చెప్పారు. మంగ‌ళ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మ‌వేశంలో బాలాజి మాట్లాడుతూ జ‌గ‌న్ పాల‌న కాలంలో రైతులు ఎన్ని ర‌కాలుగా ఇబ్బందులు ప‌డ్డారో తెలుస‌న్నారు. నాడు సీఎంగా జగన్ అనాలోచిత నిర్ణయాలు, విధానాలతో రాష్ట్ర రైతులు కోలుకోలేని విధంగా దెబ్బ‌తిన్నార‌ని గుర్తు చేశారు. వ్యవసాయరంగం, రైతుల్ని ఆదుకోవడంలో సీఎం జగన్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయాడని ఎద్దేవా చేశారు. గ‌తంలో జ‌రిగిన విష‌యాలు మ‌ర్చిపోయి ఉంటార‌ని భావించి కొత్త పంథాలో రైతుల‌ను మ‌భ్య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే విమ‌ర్శ‌లు.. రాష్ట్రంలో తుఫాన్లు, వరదలు వచ్చిన సమయంలో వైసీపీ కనీసం రైతుల గురించి ఆలోచించలేదని, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ బయటకు వస్తే పరదాల చాటున దాక్కున్న విష‌యం ప్ర‌జ‌లు మ‌రిచిపోలేద‌ని బాలాజి గుర్తు చేశారు. ఉల్లి రైతులకు రూ. 1200 క్వింటా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయడమేకాక హెక్టార్‌కు రూ. 50 వేలు సాయం ప్రకటించిందని గుర్తు చేశారు. పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలను మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు గురించి మాట్లాడటం, అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి నిమిత్తం వారికి రవాణ సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అధికారులను ప్రభుత్వం ఆదేశిందని చెప్పారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు, మ‌న్న‌న‌లు పొందుతున్న కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను చూపి వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల్లో మ‌ద్ద‌తు కొల్పోయి దిక్కుతోచని జగన్‌ ప్రజల దృష్టిని మరల్చేందుకు కూట‌మి ప్ర‌భుత్వం పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. Follow us on Website Facebook Instagram YouTube