BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 27 July 2026, 04:23 pm
Posted by : M. రాజశేఖర్

డాక్టర్ సుభాష్ రాజా ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూపై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
27 Jul, 2026 - 04:23 PM
30 వీక్షణలు

డాక్టర్ సుభాష్ రాజా ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూపై అవగాహన కార్యక్రమం


ఎన్‌కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుభాష్ రాజా ఆధ్వర్యంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని నూలుకుంట గ్రామంలోని నూలుకుంట హైస్కూల్‌లో మలేరియా, డెంగ్యూ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.


ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలకు మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాపించే విధానం, వాటి లక్షణాలు, నివారణ చర్యలు, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమతెరలు ఉపయోగించడం, జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.


అలాగే, ప్రతి శుక్రవారం "ఫ్రైడే డ్రై డే (Friday Dry Day)" పాటిస్తూ ఇంటి పరిసరాల్లోని నీటి నిల్వ పాత్రలను ఖాళీ చేసి శుభ్రపరచడం ద్వారా దోమల పెరుగుదలను నివారించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.


ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది వి. ముత్తుకుమార్, గౌతమి, గీత, ఆశా కార్యకర్తలు లక్ష్మి, పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.