BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 26 April 2026, 08:33 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 08:33 PM
125 వీక్షణలు

దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం

ధర్మవరం మండలం చిన్నూరు గ్రామంలో ఘటన

3200 దానిమ్మ చెట్లు అగ్నికి ఆహుతి పూత,కాయ దశలో పంట నష్టం మంటల్లో రైతు టూ-వీలర్ కూడా దగ్ధం ఆరున్నర ఎకరాల్లో తోట పూర్తిగా నష్టం

ప్రభుత్వం సహాయం చేయాలని రైతు విజ్ఞప్తి

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రైతు చుక్కలూరు రాము అనే రైతు చిన్నూరు కొండ కింద తన పొలంలో దాదాపు 8 ఎకరాల పైగా దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. పూత కాయ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో  తోటకి నిప్పు పెట్టడంతో దాదాపు 3200 దానిమ్మ చెట్లుతో పాటు డిప్ వైరు అగ్నికి ఆహుతి అయ్యాయని  రైతు కన్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు రాము మీడియాతో  మాట్లాడుతూ, దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాను.ఐతే రెండు పంటలు పూర్తిగా నష్టపోయానని ఈసారైనా పంట పూర్తిగా చేతికి వస్తుందని దానితో అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న  సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పక్క తోట వారు నాకు సమాచారం తెలియజేయగా నేను ఇంటి దగ్గర నుండి టూవీలర్లో పొలం దగ్గరికి వచ్చేపాటికి మంటలు పూర్తిగా వ్యాపించాయి నేను ఏం చేయాలో దిక్కుతోచక స్థితిలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశాను.

వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చేపాటికి కొంచమైనా మంటలని అదుపు చేయాలని నా 2 వీలర్ ని పక్కన పెట్టి మంటలు ఆర్పుతున్న సమయంలో టూవీలర్ కూడా అగ్నికి హాహుతి అయిపోయిందని.మొత్తం 8 ఎకరాల పొలంలో ఆరున్నర ఎకరాలలో ఉన్నటువంటి దానిమ్మ చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 15 లక్షల వరకు నష్టం జరిగిందని కావున నాపై దయవుంచి మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి,లు స్పందించి నాకు ప్రభుత్వం ద్వారా సహాయం చేసి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాo అని తెలిపారు.