BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 05:14 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ద్వారకాతిరుమలలో గేదె చోరీ కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 05:14 AM
83 వీక్షణలు

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో సంచలనం సృష్టించిన గేదె చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు, దొంగిలించిన గేదెతో పాటు దానికి జన్మించిన దూడను కూడా సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.

గత జూలై 13వ తేదీ రాత్రి గుండుగొలనుగుంట గ్రామానికి చెందిన జంగా నాగేశ్వరరావుకు చెందిన పామాయిల్ తోటలో కట్టివుంచిన చూడి గేదెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ప్రసాదరావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, భీమడోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. కృష్ణ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్ఐ టి. సుధీర్ ప్రత్యేక బృందంతో విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన దిర్శిపాము వెంకట సుబ్బారావు (24), సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరుకు చెందిన ఎరకల సౌమ్య (24)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు దొంగిలించిన గేదెను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నసీంపేట గ్రామంలో దాచిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి గేదెతో పాటు దానికి జన్మించిన దూడను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగిలించబడిన గేదెను తన వద్ద ఉంచుకున్న నసీంపేట గ్రామానికి చెందిన విజయకాంత్ పాత్ర కూడా దర్యాప్తులో వెలుగులోకి రావడంతో అతనిపై కూడా కేసు నమోదు చేశారు.

కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ఎస్ఐ టి. సుధీర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ దుర్గారావు, పోలీస్ కానిస్టేబుల్ శివకృష్ణ, హోంగార్డు జయప్రకాష్ బాబు సేవలను జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.