BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రసవించిన అరగంటలోపే ముర్రుపాలు తప్పనిసరి – డా. శ్రీగిరీష

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 05:13 AM
54 వీక్షణలు

పీలేరు మండలం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు.

ప్రసవించిన అరగంటలోపే నవజాత శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ముర్రుపాలు శిశువుకు తొలి రక్షణ కవచంగా పనిచేస్తాయని, రోగనిరోధక శక్తిని పెంచి అనేక అంటువ్యాధుల నుంచి కాపాడుతాయని వివరించారు.

జననం నుంచి తొలి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే సంపూర్ణ పౌష్టికాహారమని పేర్కొన్నారు. తల్లిపాలు శిశువు శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధి, మానసిక వికాసానికి కూడా ఎంతో దోహదపడతాయని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గర్భిణి, బాలింతకు ముర్రుపాల ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రతి శిశువుకు జీవితంలోనే ఉత్తమ ఆరంభాన్ని అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.