BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 01:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దాత పసుమర్తి కృష్ణమూర్తి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 01:29 PM
360 వీక్షణలు

దాత పసుమర్తి కృష్ణమూర్తి కన్నుమూత

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన ప్రముఖ దాత పసుమర్తి కృష్ణమూర్తి (97) బుధవారం వయోభారంతో తన పెద్ద కుమారుడు లక్ష్మణరావు నివాసంలో కన్నుమూశారు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు జీవితాన్ని అంకితం చేసిన కృష్ణమూర్తి, పెనుగొలను మెట్టగుట్ట ఆలయ ప్రాంగణంలో గజేంద్రమోక్షం, శివపార్వతులు, రథం, రాధాకృష్ణుల విగ్రహాలను స్వంత నిధులతో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

అలాగే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర సమీపంలోని ఆత్కూరు పరిధిలో ఉన్న పిల్లిగుట్ట వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం, శివపార్వతులు, లక్ష్మీదేవి తదితర విగ్రహాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయా దేవాలయాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.

కృష్ణమూర్తికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సేవా భావంతో గుర్తింపు పొందారు.

ఆయన మృతవార్త తెలుసుకున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, గ్రామస్తులు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన దాతృత్వాన్ని, ఆధ్యాత్మిక సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.