BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 10:36 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో మండల సర్వసభ్య సమావేశం!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:36 AM
92 వీక్షణలు

పుంగనూరులో మండల సర్వసభ్య సమావేశం!

అన్నమయ్య జిల్లా,పుంగనూరు 

వేరుశనగ విత్తనాల పంపిణీపై రైతుల ఆందోళన --7 రోజుల్లో న్యాయం చేస్తామని ఏవో రాధా హామీ.

పుంగనూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. మండల ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో అప్పాజీ అధ్యక్షతన ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని తమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి రాధా, మండల విద్యాశాఖ అధికారి నటరాజ రెడ్డి తదితరులు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన రైతులు వేరుశనగ విత్తనాల పంపిణీ పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నగదు వసూలు చేసినప్పటికీ ఇప్పటివరకు విత్తనాలు అందజేయలేదని, దీంతో వేరుశనగ సాగు సీజన్ ముగిసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ అధికారిని వివరణ కోరారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి రాధా మాట్లాడుతూ, మండలానికి ఇంకా సుమారు 1,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రావాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు

అవసరమైన విత్తనాలను అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న ఏడు రోజుల్లో రైతులకు న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.