BREAKING
thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం ....
Date of Publish : 26 January 2026, 07:59 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఎల్‌ఈడీ హెడ్‌లైట్లతో రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు

తెలంగాణ
26 Jan, 2026 - 07:59 PM
428 వీక్షణలు
ఎల్‌ఈడీ హెడ్‌లైట్లతో రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు ఆర్టీవో శాఖ పర్యవేక్షణపై ప్రజల ప్రశ్నలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్టీవో శాఖ నిజంగా పనిచేస్తుందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత రోడ్లపై వాహనాలు నడపాలంటే భయం వేస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాల్లో అమర్చిన అధిక కాంతి గల ఎల్‌ఈడీ హెడ్‌లైట్ల వల్ల కళ్లకు ఏమి కనిపించకుండా పోతోందని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు. అనుమతికి మించి వెలుగుతో ఉన్న లైట్లు రోడ్డు భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. గతంలో వాహనాల హెడ్‌లైట్లపై సగం వరకు బ్లాక్ పెయింట్ లేదా బ్లాక్ స్టిక్కర్ వేయకపోతే అనుమతి ఇచ్చేవారు కాదని, ప్రస్తుతం ఆ నిబంధన అమలులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని వాహనదారులు గుర్తు చేస్తున్నారు. ఎల్‌ఈడీ లైట్ల నియంత్రణలో ఆర్టీవో శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాల కాంతి వల్ల చూపు కోల్పోయి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, హెడ్‌లైట్లపై నియంత్రణ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. కనీసం హెడ్‌లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ వేయాలనే పాత నిబంధనను తిరిగి అమలు చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. #RoadSafety #LEDHeadlights #TrafficRules #RTO #VehicleSafety #NightDriving #RoadAccidents #PublicConcern #Punganur #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube