BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 23 March 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డ్రగ్స్ గంజాయి మాఫియా గ్యాంగ్‌లను తరిమికొడదాం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:20 PM
182 వీక్షణలు

డ్రగ్స్ గంజాయి మాఫియా గ్యాంగ్‌లను తరిమికొడదాం – భగత్ సింగ్ ఆశయాల కోసం. కాగడాల ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండల కేంద్రంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో సిపిఎం, సిఐటియు మండల కమిటీల ఆధ్వర్యంలో అమరవీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా కాగడాలతో ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన సుఖదేవ్ థాపర్, శివరామ్ రాజగురు వంటి యువ వీరులను స్మరించుకున్నారు. అప్పట్లో దేశం కోసం యువత ప్రాణాలు అర్పించగా, నేటి కాలంలో కొంతమంది యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ మాఫియా, గంజాయి వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు పదార్థాలపై ప్రజలు, కార్మికులు, యువత కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం, సిఐటియు మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు రాము, హర్ష, తాపీ వర్కర్స్ యూనియన్ సభ్యులు గజ్జినబోయిన రాము, లక్కనబోయిన శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, రంగా రాణి తదితరులు పాల్గొన్నారు.