BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 06:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెంలో దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Sep, 2026 - 06:04 PM
18 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ‘ఏకాత్మ మానవతావాదం’గా పిలుస్తారని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక విలువల ఆధారంగా ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని వివరించారు. సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలన్నది దీనదయాళ్ ఉపాధ్యాయ ఆలోచనల్లో ప్రధాన అంశమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం భారతమాతకు జై నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు వనమా సత్యవాణి, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొనపర్తి నాగగోపాలకృష్ణ, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి వనమా పద్మావతి, పాపోలు నరసింహారావు, తరిగొప్పుల సత్యనారాయణ, కొనపర్తి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.