BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 08:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మనీమ చిత్రానికి క్లాప్ కొట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 08:13 PM
16 వీక్షణలు

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమైన చిత్రీకరణ పూరి జగన్నాథ్ ఆలయ ఇతివృత్తంతో ఆధ్యాత్మిక నేపథ్యంగా సినిమా కీలక పాత్రలో సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తనయుడు తరంగ్ హైదరాబాద్: పూరి జగన్నాథ్ దేవాలయ ఇతివృత్తంతో ఆధ్యాత్మిక నేపథ్యంగా రూపొందుతున్న ‘మనీమ’ సినిమా చిత్రీకరణ ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి సినిమా చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తనయుడు తరంగ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్ నల్ల దర్శకత్వం వహిస్తుండగా, అమరేష్ చంద్ర సారంగి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా భట్టి విక్రమార్క దర్శకుడు, నిర్మాతతో పాటు నటీనటులు, సాంకేతిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు దర్శకుడు నవీన్ నల్ల, నిర్మాత అమరేష్ చంద్ర సారంగి ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నటీనటులు పృథ్వీ, విష్ణు, సేన్ గుప్తా, కబీర్ దుహన్ సింగ్, బాబీ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.