ఢిల్లీ నిరసనకు ముందు ధ్రువ్ రాఠీ అదుపులోకి?
గురుగ్రామ్ నివాసం నుంచి అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద నిరసన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని శనివారం గురుగ్రామ్‌లోని సెక్టార్ 56 నివాసం నుంచి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతిపాదించిన నిరసనకు ముందు ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పేర్కొంది.
CJP నిరసనలో పాల్గొనేందుకు ధ్రువ్ రాఠీ వెళ్లాల్సి ఉండటంతో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. పోలీసు వర్గాల వివరాల ప్రకారం, గురుగ్రామ్‌లోని ఆయన నివాసం వద్ద సుమారు 50 మంది పోలీసులతో కూడిన బృందం మోహరించినట్లు కథనంలో పేర్కొన్నారు.
అయితే ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకోవడానికి గల అధికారిక కారణాలు, తదుపరి చర్యలపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.