BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 02:31 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రజలతో నేరుగా మమేకం.. సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలపై చర్చిస్తున్న టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Sep, 2026 - 02:31 PM
10 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వై. మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను నేరుగా ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు.

ప్రజలు తెలిపే సమస్యలను సావధానంగా వింటూ, వాటి పూర్తి వివరాలను తెలుసుకున్న అనంతరం సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో మాట్లాడి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత సమస్యలు తదితర అంశాలపై ప్రజలు వినతులు అందిస్తున్నారు.

ప్రజల సమస్యలను కేవలం వినడంతోనే సరిపెట్టకుండా, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని మధుసూదన్ నాయుడు సూచిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ప్రజా దర్బార్ ఒక వేదికగా ఉపయోగపడుతోందని ఆయన పేర్కొంటున్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.