BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 04:00 pm
Posted by : K MAHESH

కురవి మండలంలో 851 మందికి నూతన పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / దోర్నకల్
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 04:00 PM
18 వీక్షణలు

పది సంవత్సరాల తర్వాత పింఛన్లు రావడంతో లబ్ధిదారుల్లో ఆనందం

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్

మహబూబాబాద్ జిల్లా | కురవి | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. మంగళవారం కురవి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 851 మంది నూతన పింఛన్ లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా రామచంద్ర నాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో చాలా కాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్నామని, కురవి మండలంలోనే 851 మందికి పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు.

కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, అర్హత ఉన్నప్పటికీ పింఛన్ మంజూరు కాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం, కారు వంటి అర్హతకు విరుద్ధమైన అంశాలు ఉన్న దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు వివరించారు.

వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లతో ఆర్థిక భరోసా

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందడం ద్వారా వారి జీవనానికి ఆర్థిక భరోసా లభిస్తుందని చెప్పారు.

గత పదేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసిన తమకు ఇప్పుడు పింఛన్ మంజూరు కావడం సంతోషంగా ఉందని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. పింఛన్ ద్వారా తమ కుటుంబ అవసరాలకు కొంత ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, సర్పంచ్ నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బండి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి గార్లపాటి వెంకటరెడ్డి, సర్పంచ్ బాదావత్ లక్ష్మి, ఉపసర్పంచ్ చర్య నాగేశ్వరరావు, సీనియర్ నాయకుడు బాదావత్ రాము నాయక్, టౌన్ అధ్యక్షుడు నారాయణ రాజేందర్, ఎంపీడీవో కే. వీరబాబు, తహసీల్దార్ విజయ, డీఎల్పీవో స్వరూప, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, ఎమ్మెల్సీ మండల కన్వీనర్ గార్లపాటి భరద్వాజ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.